Telangana Telugu Desam Party leaders L Ramana and Mothkupalli question Revanth Reddy over his resignation and assets.

తనపై కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ ఘాటుగా స్పందించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను ఉపాధి కూలీని అంటూ తనపై రేవంత్ ఆరోపణలు చేశారని, అదేమిటో చెప్పాలని రమణ నిలదీశారు. దేనికి ఉపాధి కూలీగా ఉన్నానో చెప్పాలని అడిగారు.
తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌కు తాను ఓ సవాల్ విసురుతున్నానని రమణ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను సంపాదించినది, ఆయన సంపాదించినది పేదలకు ఇచ్చేందుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
తనకు 1994లో ఎమ్మెల్యే కాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పటికీ అవే ఉన్నాయని, ఎవరైనా తనకు సాయం చేసేందుకు ముందుకు వస్తే ఆ మొత్తం పేదలకు, సన్నిహితులకు అందేలా చూశానని రమణ చెప్పారు.